
సీబీఎస్ఈ వివాదం.. రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
సీబీఎస్ఈ ఓఎస్ఎం వివాదంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇటీవల కొందరు విద్యార్థులతో సంభాషించిన వీడియోను ఆయన షేర్ చేశారు. విద్యార్థులు మోదీ ప్రభుత్వాన్ని చిన్న ప్రశ్నలు అడిగితే, వారిని అవమానించి దేశ వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారని రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశద్రోహులతో ఆసక్తికర సంభాషణ జరిగిందని, వీరికి చక్కటి భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. ఇటీవల సీబీఎస్ఈ అప్లోడ్ చేసిన 12వ తరగతి ఆన్సర్ షీట్ తమది కాదని వేదాంత్ అనే విద్యార్థి పోస్ట్ చేయడంతో ఈ వివాదం తీవ్ర కలకలం రేగింది.




