విజిలెన్స్ అధికారుల విధులకు ఆటంకం.. ఇద్దరిపై కేసు నమోదు

0చూసినవారు
కావలిలో ప్రభుత్వ భూముల ఆక్రమణలు, లేఅవుట్ల విక్రయాలపై విచారణకు వెళ్లిన విజిలెన్స్ అధికారులకు ఆటంకం కలిగించిన ఆరోపణలపై ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. విజిలెన్స్ సీఐ నరసింహారావు ఫిర్యాదు మేరకు పట్టణానికి చెందిన చెవల రామకృష్ణ, కె. రామకృష్ణలను నిందితులుగా చేర్చారు. గురువారం తనిఖీలకు వెళ్లిన అధికారులతో నిందితులు దురుసుగా ప్రవర్తించి విధులకు ఆటంకం కలిగించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్