
క్రేన్ కూలిన ఘటన.. ఐదుకి చేరిన మృతుల సంఖ్య (వీడియో)
రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోని మహాలింగాపురం వద్ద సిమెంట్ బ్రిక్స్ కంపెనీలో ఘోర ప్రమాదం జరిగింది. కంపెనీలో పనిచేస్తున్న క్రేన్ కూలిపోవడంతో ఐదుగురు అమాయక కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 11 మంది కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆసుపత్రిలో మరికొంతమంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.




