సిరిపురం చెరువు మరమ్మత్తులకు శ్రీకారం – ఎమ్మెల్యే కావ్య

1055చూసినవారు
కావలి రూరల్ మండలం సిరిపురం చెరువు మరమ్మత్తు పనులను కావ్య కృష్ణారెడ్డి, అధికారులతో కలిసి ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, చెరువు పునరుద్ధరణతో రైతులకు సాగునీరు మెరుగ్గా అందుతుందని, భూగర్భ జలాల స్థాయి పెరిగి వ్యవసాయానికి ఊతం లభిస్తుందని తెలిపారు. పనులను నాణ్యతతో, నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్