పార్లపల్లిలో సీతారాముల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

1375చూసినవారు
పార్లపల్లిలో సీతారాముల కళ్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
నెల్లూరు జిల్లా కొండాపురం మండలం పార్లపల్లి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో మొదటి రోజున శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. పుణ్యవచనం, పుట్టమట్టి సేకరణ, గణేశ పూజ అనంతరం అఖండ జ్యోతిని వెలిగించి వేడుకలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షులు మామిళ్ళపల్లి ఓంకార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరు కావాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్