కొండబిట్రగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో దాదాపు రూ. 2.25 కోట్ల వ్యయంతో నిర్మించిన పుష్కరిణిని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి దంపతులు వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య ఘనంగా ప్రారంభించారు. స్వామివారి బ్రహ్మోత్సవాల సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమానికి భారీగా భక్తులు హాజరయ్యారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రహరీ, గాలిగోపురాలు, కల్యాణ మండపం వంటి పలు అభివృద్ధి పనులు దాతల సహకారంతో కొనసాగుతున్నట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు.