సముద్ర వేటకు వెళ్లి ఇద్దరు మత్స్యకారులు మృతి

2చూసినవారు
సముద్ర వేటకు వెళ్లి ఇద్దరు మత్స్యకారులు మృతి
కావలి నియోజకవర్గం బోగోలు మండలం జువ్వలదిన్నె ఆరిచార్ల బంగారుపాలెం గ్రామానికి చెందిన తుపిలి బాలమురళి, కుమారి గోవిందు బుధవారం తెల్లవారుజామున చేపల వేటకు వెళ్లారు. ఈ క్రమంలో గాలికి వారి తెప్ప తిరగబడటంతో సముద్రంలో మునిగి ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్