ఉదయగిరి బీసీ కాలనీ పాఠశాల ఎస్ఎస్సీ ఫలితాల్లో సంచలనం

1624చూసినవారు
ఉదయగిరి బీసీ కాలనీ పాఠశాల ఎస్ఎస్సీ ఫలితాల్లో సంచలనం
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, ఉదయగిరిలోని బీసీ కాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎస్ఎస్సీ-2026 ఫలితాల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించి అద్భుత విజయాన్ని అందుకుంది. పాఠశాల అప్‌గ్రేడ్ అయిన తొలి ఏడాదే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ సందర్భంగా విద్యార్థులను ప్రధానోపాధ్యాయురాలు షేక్ నూర్జహాన్, ఉపాధ్యాయ బృందం అభినందించారు. ఉపాధ్యాయుల సమిష్టి కృషితోనే ఈ విజయం సాధ్యమైందని ఆమె కొనియాడారు.

సంబంధిత పోస్ట్