ఫీల్డ్ అసిస్టెంట్ ప్రేమదాస్ అకాల మరణం: గ్రామంలో విషాదం

2521చూసినవారు
ఫీల్డ్ అసిస్టెంట్ ప్రేమదాస్ అకాల మరణం: గ్రామంలో విషాదం
నెల్లూరు జిల్లా వింజమూరు మండలం నందిగుంట గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ ముద్దాల ప్రేమదాస్ అనారోగ్యంతో మంగళవారం అకాల మరణం చెందారు. ఆయన మృతి గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తూ ప్రజల మన్ననలు పొందిన ప్రేమదాస్ మరణం కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు ప్రముఖులు, గ్రామస్థులు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్