నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలంలోని విశ్వతేజ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ పదవ తరగతి (SSC) ఫలితాల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచింది. గురువారం విడుదలైన ఫలితాల్లో పాఠశాల
విద్యార్థులు అత్యుత్తమ గ్రేడ్లు సాధించి విజయ దుందుభి మోగించారు. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం విద్యార్థులను, ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు. నాణ్యమైన బోధన, నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ విజయం సాధ్యమైందని వారు పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల సాధించిన ఈ ఘనతపై హర్షం వ్యక్తం చేశారు.