
ముసునూరు టోల్ వద్ద డ్రంక్ డ్రైవ్ తనిఖీలు – 4 మందికి జరిమానా
కావలి రూరల్ పరిధిలోని ముసునూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహించారు. సీఐ రాజేశ్వరరావు నేతృత్వంలో జరిగిన ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని న్యాయమూర్తి ముందు హాజరుపరచగా, ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున మొత్తం రూ. 40 వేల జరిమానా విధించారు. పేకాట, కోడిపందాలు, గంజాయి వంటి అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.








































