
కావలి కొత్త డీఎస్పీగా వివిరమణ కుమార్ బాధ్యతల స్వీకారం
కావలి పోలీసు సబ్‌డివిజన్ డీఎస్పీగా వివిరమణ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, డివిజన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని, పోలీస్-ప్రజల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తానన్నారు. ఇప్పటివరకు కావలి డీఎస్పీగా పనిచేసిన శ్రీధర్‌ను ఒంగోలు దిశ మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీగా బదిలీ చేశారు.






































