
దండి మార్చ్ 2. 0 పోస్టర్ను ఆవిష్కరించిన కావలి MLA కావ్య
మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు నిర్వహించనున్న దండి మార్చ్ 2.0 ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణారెడ్డి మంగళవారం ఆవిష్కరించారు. ఈ ర్యాలీ మార్చి 12న ఉదయం 9 గంటలకు కావలి పట్టణంలోని బ్రిడ్జి సెంటర్ నుంచి సెల్ఫీ పాయింట్ వరకు నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని నిర్వాహకులు ఎమ్మెల్యేను ఆహ్వానించారు.





































