
2047 నాటికి పేదలను బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అధ్యక్షతన P4 మొదటి వార్షికోత్సవ సభ జరిగింది. ఈ సందర్భంగా పేదల సంక్షేమం, జీవన ప్రమాణాల మెరుగుదలపై చర్చించి, 8 మంది మార్గదర్శకులను సన్మానించారు. 2047 నాటికి పేదలందరినీ బంగారు కుటుంబాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో దాతలు, సేవాభావం ఉన్నవారు ముందుకు రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలు విద్య, ఆరోగ్యం, ఉపాధిలో మార్పు తెస్తాయని, సమాజం కలసి పనిచేయాలని ఆయన తెలిపారు.





































