
కోవూరు: బాలికపై అత్యాచారం.. 20 ఏళ్లు శిక్ష
నెల్లూరు (జి)కోవూరు జైలు పరిధిలో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి 20 ఏళ్ల శిక్ష, రూ.25,000 జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి సీపీరెడ్డి సుమ మంగళవారం తీర్పు ఇచ్చారు. కోవూరు(ఎం)కి చెందిన బాలికపై అదే గ్రామానికి చెందిన రాయదుర్గం వెంకటేశ్వర్లు అత్యాచారం కేసు నమోదైంది. విచారణ జరిపిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష ఖరారు చేసింది. ఈ తీర్పు 2021 మార్చి 21న వెలువడింది.







































