కొడవలూరులో కిషోర్ వికాసం పై అవగాహన

6చూసినవారు
కొడవలూరులో కిషోర్ వికాసం పై అవగాహన
కొడవలూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం కిషోర్ బాలికలకు వికాసంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఐసిడిఎస్ సూపర్వైజర్లు రాజేశ్వరమ్మ, నాగభూషణం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాలికల ఆరోగ్యం, భద్రత, విద్య, వ్యక్తిత్వ వికాసంపై అవగాహన కల్పించారు. గుడ్ టచింగ్, బ్యాడ్ టచింగ్ గురించి వివరించారు. బాలికలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే 1098కు సమాచారం అందించాలని సూచించారు. అనంతరం ప్లా కార్డులతో ప్రదర్శన నిర్వహించారు.
Job Suitcase

Jobs near you