బుచ్చి మండలం దామరమడుగు హరిజనవాడలో కుటుంబ కలహాలు తీవ్రమయ్యాయి. ఓ యువతి విషయంలో అన్నను మందలించడంతో ఆగ్రహించిన వ్యక్తి, తన తమ్ముడు శ్యాంకుమార్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో శ్యాంకుమార్‌కు కడుపు, ముఖంపై గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని వెంటనే బుచ్చి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.