బుచ్చి టోల్ ప్లాజా సమీపంలో నెల్లూర్ - ముంబై జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని బైక్ పై వస్తున్న వ్యక్తి వేగంగా ఢీకొట్టి కింద పడిపోయాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 ద్వారా అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లుగా స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదం గురించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.