బుచ్చిరెడ్డిపాలెం జొన్నవాడ రోడ్డులోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి సేల్స్ పాయింట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు చెలరేగడంతో బుచ్చి పట్టణం దట్టమైన పొగతో కమ్ముకుంది. ఘటన సమయంలో అక్కడ నిలిపి ఉన్న వాహనాలు అగ్నికి ఆహుతయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు గమనించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. మంటలు ఎలా ప్రారంభమయ్యాయనే దానిపై విచారణ జరుగుతోంది.