జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో డీజిల్, పెట్రోల్ నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. సోమవారం కొడవలూరు మండలం రామన్నపాలెం వద్ద ఉన్న జయ పెట్రోల్ బంక్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పెట్రోల్ బంక్ యజమాని సుమన్‌తో మాట్లాడి స్టాక్ వివరాలు తెలుసుకున్నారు. ప్రస్తుతం బంక్‌లో సరిపడా నిల్వలు ఉన్నప్పటికీ, ప్రజలు ఒక్కసారిగా భారీగా రావడం వల్ల తాత్కాలిక ఒత్తిడి ఏర్పడిందని యజమాని వివరించారు.