ఇందుకూరుపేట మండలం కొత్తూరులో దొంగలు రెచ్చిపోయారు. పంట పొలాల్లో ఏర్పాటు చేసిన 8 విద్యుత్ మోటార్లకు చెందిన వైర్లను ఒకే రాత్రిలో అపహరించారు. ఈ ఘటనతో రైతులకు వేల రూపాయల నష్టం వాటిల్లింది. అప్పులు చేసి సాగు చేస్తున్నామని, వరుస చోరీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దొంగలను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.