కోవూరు మండల వ్యవసాయ అధికారి రజిని, బుధవారం కోవూరులో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ, అధిక మోతాదులో యూరియా, పురుగుమందులు వాడటం వల్ల నేల సారం తగ్గి పంట దిగుబడులపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఎకరాకు గరిష్టంగా మూడు బస్తాల యూరియా మాత్రమే వినియోగించాలని రైతులకు సూచించారు. ఈ సూచనలు రైతులు పాటించడం ద్వారా భూసారాన్ని కాపాడుకోవచ్చని తెలిపారు.