బుచ్చి పట్టణంలో ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించాలని సీఐ మాతంగి శ్రీనివాసరావు వాహనదారులకు సూచించారు. ముఖ్యంగా బైక్‌పై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేకపోతే జరిమానాలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల రోడ్డు ప్రమాదాలు అధికమవుతున్నాయని, హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలో పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు.