బుచ్చి పట్టణంలోని సిండికేట్ బ్యాంకు వీధిలో అన్నపరెడ్డి వెంకటేశ్వర్లు, లక్షమ్మలకు చెందిన పూరిల్లు బుధవారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైంది. స్థానిక యువకులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. నెల్లూరు నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చి, అవి పక్క ఇళ్లకు వ్యాపించకుండా నివారించడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో బీరువాలోని రూ. 10 వేలు నగదు, ఇంటి పట్టా పత్రాలు, లక్ష రూపాయల విలువైన వస్తువులు కాలి బూడిదయ్యాయి.