నావూరులో అగ్నిప్రమాదం.. అప్రమత్తమైన గ్రామస్తులు

4చూసినవారు
పొదలకూరు మండలం నావూరు గ్రామంలోని పడమటి కంచెలో గురువారం సాయంత్రం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా ఎగిసిపడిన మంటలను గమనించిన గ్రామస్తులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆకతాయిల చర్యలేమైనా ఉన్నాయా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్