ఇందుకూరుపేట మండలం రాముడుపాలెంలో గడ్ల కాలువ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. గంగపట్నానికి ఆక్వా ఫీడ్ తీసుకెళ్తున్న ట్రాక్టర్, ఆటోను ఢీకొట్టడంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించి, గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.