మాజీమంత్రి , వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యల నిరసిస్తూ ఇందుకూరుపేట మండలంలో మహిళలు పెద్ద ఎత్తున ఆదివారం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ని పట్ల అనుచితంగా వ్యాఖ్యలు చేసిన నలపరెడ్డి ప్రసన్నను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేసారు.