కొడవలూరు మండలం రాచర్లపాడు వద్ద ఉన్న ఇఫ్కో కిసాన్ సెజ్ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ మహానాడు పనులు భూమిపూజతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు బీద రవిచంద్ర, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, ఇంటూరి నాగేశ్వరరావు, కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్ కుమార్, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు.