కొడవలూరు: గ్యాస్ లీక్‌తో ఇంటి దగ్ధం

1370చూసినవారు
కొడవలూరు మండలం పద్మనాభ సత్రంలో బుధవారం రాత్రి పోట్ల మల్లికార్జున ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వడంతో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ఇంట్లోని ఫర్నిచర్, టీవీలు, ఏసీలు, ల్యాప్‌ట్యాప్‌లు, బీరువాలు, దుస్తులు వంటి సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. బాధితుల అంచనా ప్రకారం సుమారు రూ. 7 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగింది. అగ్నిప్రమాదంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.