కొడవలూరు: నిర్లక్ష్యపు ట్రాక్టర్ డ్రైవింగ్‌తో మహిళకు గాయాలు

1585చూసినవారు
కొడవలూరు: నిర్లక్ష్యపు ట్రాక్టర్ డ్రైవింగ్‌తో మహిళకు గాయాలు
కొడవలూరు మండలంలోని మానెగుంటపాడు రోడ్డుపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ గాయపడింది. పొలం పనులకు వెళ్లి రోడ్డు పక్కన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆమెను నిర్లక్ష్యంగా నడిపిన డ్రైవర్ ట్రాక్టర్ తో ఢీకొట్టాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ట్రాక్టర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు కొడవలూరు ఎస్సై కోటిరెడ్డి ఆదివారం వెల్లడించారు.

సంబంధిత పోస్ట్