కోవూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హోంగార్డు వడ్డేముక్కల మల్లికార్జునపై దాడి కేసులో, నిందితుడైన మధ్యప్రదేశ్ కు చెందిన లారీ డ్రైవర్ సంతోష్ కుమార్ రావత్ కు కోవూరు సబ్ జడ్జి సోమవారం ఏడాది పాటు జైలు శిక్ష విధించారు. ఈ ఘటన 2019 ఫిబ్రవరి 3వ తేదీన జరిగింది. మద్యం సేవించి గొడవ చేస్తున్న సంతోష్ కుమార్ ను అడ్డుకునే ప్రయత్నం చేసిన హోంగార్డుపై, నిందితుడు మద్యం బాటిల్ తో తల, ముక్కుపై కొట్టి గాయపరిచాడు. హోంగార్డు ఫిర్యాదు మేరకు అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.