కోవూరు డివిజన్ పరిధిలోని పోతిరెడ్డి పాలెం గ్రామంలోని తిప్పగిరిజన కాలనీలో శుక్రవారం ఎస్ఈ కె రాఘవేంద్రం పర్యటించారు. వినియోగదారులతో ప్రత్యక్షంగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. వినియోగదారుల సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి తక్షణ పరిష్కారం చూపాలనే లక్ష్యంతో 'కరెంటోళ్ళ జనబాట' కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు. విద్యుత్ లైన్లు, ట్రాన్స్ఫార్మర్లకు సమీపంలో గాలిపటాలు ఎగురవేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.