జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల రైతులకు ఛాంపియన్ ఫార్మర్స్‌ను ఆదర్శంగా తీసుకొని వ్యవసాయ రంగంలో శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని మెరుగైన ఫలితాలు సాధించాలని సూచించారు. శనివారం కోవూరులో ఛాంపియన్ ఫార్మర్ పునూరు శ్రీనివాసులు వరి పొలాన్ని సందర్శించి, సోలార్ లైట్ ట్రాప్స్, ఫెరోమోన్ ట్రాపుల ఉపయోగాల గురించి రైతు వివరించగా కలెక్టర్ పరిశీలించారు.