కోవూరు మండలం పాటూరుకు చెందిన బీటెక్ మొదటి సంవత్సరం విద్యార్థి పవన్ సాయి (19) గడ్డి సేవించి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. గత నెల 27న ఇంట్లోనే గడ్డి సేవించిన అతనికి వాంతులు కావడంతో తండ్రి నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన పాటూరులో విషాదాన్ని నింపింది.