కోవూరు: గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి

4చూసినవారు
కోవూరు: గూడ్స్ రైలు ఢీకొని వ్యక్తి మృతి
కోవూరు పడుగుపాడులో శుక్రవారం గూడ్స్ రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. బిట్రగుంట నుంచి రేణిగుంట వైపు వెళ్తున్న రైలు పట్టాలు దాటుతున్న వ్యక్తిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మరణించాడు. మృతుడి వయసు 45-50 ఏళ్లు ఉండొచ్చని అంచనా. అతని వివరాలు తెలియాల్సి ఉందని, తెలిసినవారు సంప్రదించాలని రైల్వే పోలీసులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్