రెండు కోట్ల సిమెంట్ రోడ్లను ప్రారంభించిన కోవూరు ఎమ్మెల్యే

6చూసినవారు
రెండు కోట్ల సిమెంట్ రోడ్లను ప్రారంభించిన కోవూరు ఎమ్మెల్యే
బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ పరిధిలో బుధవారం, ఆంధ్రప్రదేశ్ పట్టణ ఆర్థిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ స్పెషల్‌ గ్రాంట్‌ కింద రూ. 2 కోట్లతో మంజూరైన సిమెంటు రోడ్ల నిర్మాణానికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నుడా ఛైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కలిసి శంకుస్థాపన చేశారు. అలాగే, బైపాస్ రోడ్డు నుంచి శేషాద్రి నగర్ రోడ్డు వరకు రూ. 50 లక్షల నుడా నిధులతో నిర్మించిన సీసీ డ్రెయిన్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం, పట్టణంలోని అంబేద్కర్ బొమ్మ సెంటర్ వద్ద మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఐ లవ్ బుచ్చిరెడ్డిపాళెం’ ఎల్‌ఈడీ లైటింగ్ సిస్టమ్‌ను కూడా వారు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్