ఆలయంలోని గొడవకు ఎమ్మెల్యేకు సంబంధం లేదు.. సర్వేశ్ రెడ్డి

1497చూసినవారు
కోవూరు సాయిబాబా ఆలయంలో జరిగిన గొడవ రాజకీయపరమైనది కాదని, వ్యక్తిగత విభేదాల వల్లే జరిగిందని బాధితుడు సర్వేశ్ రెడ్డి ఆదివారం మీడియాకు తెలిపారు. ఈ ఘటనకు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి ఎటువంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. స్థానికంగా ఉన్న వ్యక్తిగత వివాదాల నేపథ్యంలోనే ఈ చిన్నపాటి గొడవ చోటుచేసుకుందని, కొందరు దీనికి రాజకీయ రంగు పులమడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ అంశాన్ని రాజకీయంగా మలచడం సరికాదని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్