మన బడి- మన భవిష్యత్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారుస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ఎమ్మెల్యే ప్రశాంతి ధన్యవాదాలు తెలియచేసారు. మంగళవారం ఆమె శాసనసభలో క్షేత్ర స్థాయిలో విద్యారంగ సమస్యలను ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పునాది బాగుంటే భవనం పటిష్టంగా ఉంటుంది అన్నట్టు బడులు బాగుంటే విద్యార్థుల భవిష్యత్ బాగుంటుందన్నారు.