మంగళవారం మనుబోలు మండలం కోదండరామపురం సెంటర్లో పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. పూల దుకాణం సమీపంలో తిరుగుతున్న కుక్క ఆకస్మికంగా ప్రజలపై దాడి చేయడంతో కోదండరామపురానికి చెందిన మస్తాన్ రెడ్డితో పాటు 20 మందికి పైగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన వారిని స్థానికులు వెంటనే మనుబోలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. గ్రామస్తులు అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.