సరైన గుర్తింపు ఆధారాలు లేక ప్రభుత్వ సంక్షేమ పథకాలకు దూరమవుతున్న గిరిజన కుటుంబాలకు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అండగా నిలిచారు. ఇందుకూరుపేట మండలం ముదివర్తి గ్రామంలోని పలు గిరిజన కుటుంబాలకు ఆధార్ కార్డులు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గ్రామస్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే, సంబంధిత ఐటిడిఏ, తహసిల్దార్ లతో మాట్లాడి, ఎటువంటి ఆధారాలు లేని సదరు గిరిజనులకు ప్రత్యేకంగా 'డోమిసైల్ సర్టిఫికెట్లు' మంజూరు చేయించాలని సూచించారు.