విడవలూరు మండలం, రామతీర్థం పంచాయతీలోని ఎస్టీ కాలనీ, కోవూరు జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాల, కోవూరు ప్రభుత్వ వైద్యశాల, పడుగుపాడు గ్రామాలలో వి. పి. ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 'వి. పి. ఆర్ అమృత ధార వాటర్ ప్లాంట్ల' ప్రారంభోత్సవ కార్యక్రమం శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, శాసనమండలి సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు బీద రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు.