హైబ్రిడ్ విధానంలో అట్టహాసంగా ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ‘మహానాడు’లో నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు తమ ఉదారతను చాటుకున్నారు. నెల్లూరు జిల్లాలో పార్టీని క్లీన్ స్వీప్ (10కి 10 సీట్లు) దిశగా నడిపించడంలో కీలక భూమిక పోషించిన వేమిరెడ్డి దంపతులు, పార్టీ పట్ల తమకున్న అంకితభావాన్ని మరోసారి నిరూపించుకున్నారు. బుధవారం మహానాడు మొదటి రోజున తెలుగుదేశం పార్టీ నిధికి వీరు రూ. 5 కోట్ల భారీ విరాళాన్ని అందజేసి తమ ప్రత్యేకతను చాటుకున్నారు.