నెల్లూరు రూరల్ పరిధిలోని కనపర్తిపాడు విపిఆర్ హైస్కూల్లో 10వ తరగతిలో 594 మార్కులు సాధించిన విద్యార్థిని సిహెచ్ మానసను కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గురువారం నెల్లూరు నగరంలోని వీపిఆర్ కార్యాలయంలో అభినందించారు. మానస తల్లిదండ్రులకు పై చదువులకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.