కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఎమ్మెల్సి బీద రవిచంద్రతో కలిసి విడవలూరు మండలం రామతీర్ధం గ్రామంలో విపిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆర్ ఒ వాటర్ ప్లాంట్ ను ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాసేవ చేయడానికే రాజకీయాల్లోకి వచ్చామని, పేదల సంక్షేమమే తమ ధ్యేయమని తెలిపారు. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.