పెన్నా నది పరీవాహక ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలను జూన్ 1 నుంచి అక్టోబర్ 15 వరకు నిలిపివేస్తూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు బుచ్చిరెడ్డిపాళెం తహసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా జిల్లాలో ప్రభుత్వం గుర్తించిన ఎనిమిది ఇసుక రీచ్‌ల నుంచి అవసరమైన ఇసుకను పొందవచ్చని ఆయన పేర్కొన్నారు. నిబంధనలను ఉల్లంఘించి అక్రమ తవ్వకాలు చేపట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.