కొడవలూరు మండలం యల్లాయిపాలెం నుంచి పాటూరు వెళ్లే ప్రధాన రహదారి పూర్తిగా దెబ్బతింది. ఎక్కడికక్కడ పెద్ద గుంతలు ఏర్పడి రాళ్లు పైకి తేలడంతో వాహనాలు నడపడం కష్టంగా మారింది. రోజూ ఈ మార్గంలో ప్రయాణించే ప్రజలు ప్రమాద భయంతో సాగుతున్నారు. గుంతల కారణంగా వాహనాలు తరచూ చెడిపోతున్నాయని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకుని రోడ్డు పునరుద్ధరించాలని స్థానికులు కోరుతున్నారు.