నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లులో వేరుశనగ పొలం యజమాని వేధింపులు తట్టుకోలేక కాపలాదారు ప్రసాద్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి భార్య వెంకాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసరావు తెలిపారు. డీఎస్పీ, ఎంఆర్వో పర్యవేక్షణలో జొన్నవాడ పెన్నా నదిలో పూడ్చిపెట్టిన ప్రసాద్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.