Mar 03, 2026, 17:03 IST/వికారాబాద్
వికారాబాద్
వికారాబాద్: పెరిగిన యాసంగి సాగు
Mar 03, 2026, 17:03 IST
వికారాబాద్ జిల్లాలో యాసంగి సాగు గణనీయంగా పెరిగింది. జిల్లాలో 3,34,627 మంది రైతులు ఉండగా, అత్యధికంగా వరి పంటను పండిస్తున్నారు. గతంలో 75,838 ఎకరాల్లో సాగు ఉండేది, ప్రస్తుతం ఇది 93,116 ఎకరాలకు పెరిగింది. అన్ని పంటలు కలిపి మొత్తం 1,45,241 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దీనితో జిల్లాలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది.