Mar 07, 2026, 14:03 IST/
హోలీ రంగుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. నలుగురు మహిళలు మృతి
Mar 07, 2026, 14:03 IST
హర్యానాలోని ఒక హోలీ రంగుల తయారీ కర్మాగారంలో తాజాగా అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు మహిళా కార్మికులు మరణించగా 20 మంది గాయాలపాలయ్యారు. జింద్ జిల్లాలోని సఫిడాన్ నగరంలోగల భట్ కాలనీలో ఈ ప్రమాదం జరిగింది. అకస్మాత్తుగా చెలరేగిన మంటలు నిమిషాల వ్యవధిలోనే కర్మాగారం అంతా వ్యాపించాయి. దట్టమైన పొగ కమ్మేసింది. అసలేం జరిగిందో అర్థం కాక కార్మికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.