
నెల్లూరులో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
నెల్లూరు గ్రామీణం, నెల్లూరు సిటీ ప్రాంతాలలో శనివారం 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లూరు సిటీ 16వ డివిజన్‌లోని గుర్రాలమడుగు సంఘం వద్ద జరిగిన కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, అవినీతి, అసమానతలపై పోరాడటమే నిజమైన స్వాతంత్ర్య స్ఫూర్తి అని ఆయన అన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రజాసేవకు అంకితం కావాలని పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో పలువురు జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






































